
నోయిడా (ఉత్తరప్రదేశ్) : మైనర్‌ను 80 ఏళ్ల వృద్ధుడు ఏడేళ్లుగా లైంగికంగా వేధించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో చోటుచేసుకుంది. పోలీసులు 'డిజిటల్ రేప్' గా కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో డిజిటల్ రేప్ నమోదవడం రెండోసారి.
వివరాల్లోకెళితే .... అలహాబాద్‌కు చెందిన మౌరిస్ రైడర్ (80) నోయిడాలో తన స్నేహితురాలితో కలిసి నివసిస్తున్నాడు. మౌరిస్ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. ఇంట్లో పని చేసేందుకు ఓ బాలికను (17) పెట్టుకున్నారు. ఏడేళ్లుగా బాలిక అక్కడే పనిచేస్తోంది. ఈ క్రమంలో... మౌరిస్ రైడర్.. తనను పనిలో చేరినప్పటి నుంచి లైంగికంగా వేధిస్తున్నాడంటూ బాలిక ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను, వీడియో, ఆడియో రికార్డుల రూపంలో పోలీసులకు అందజేసింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. డిజిటల్ రేప్ అభియోగాలు మోపారు.
డిజిటల్ రేప్ అంటే..
డిజిటల్, రేప్ అనేవి రెండూ వేర్వేరు పదాలు. డిజిట్ అంటే ఆంగ్లంలో అంకె అని అర్థం. ఇంగ్లీష్ డిక్షనరీలో శరీర భాగాలకు కూడా నంబర్లు ఉంటాయి. అందుకే డిజిట్, రేప్ కలిపి డిజిటల్ రేప్ అని పేరు పెట్టారు. డిజిటల్ రేప్ అంటే.. బాధితురాలి జననాంగంలోకి నిందితుడు చేతి వేళ్లు, కాలి వేళ్లు లేక వస్తువులను చొప్పించడం. ఇలా ఉత్తరప్రదేశ్‌లో డిజిటల్ కేసు నమోదవడం రెండోసారి.