Jul 28,2021 18:50

తమిళ నటుడు ధనుష్‌, మాళవిక మోహనన్‌ నటిస్తున్న తాజా చిత్రం 'డి43'. ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిల్మ్స్‌ నిర్మిస్తోంది. బుధవారం ధనుష్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు 'మారన్‌' అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 'మారన్‌' అనేది తమిళ పాండ్య రాజుల కాలం నాటిది. ఈ చిచతం థ్రిల్లర్‌ కథా నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రానికి కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వం వహించారు. మహేంద్రన్‌, సముద్రఖని, స్మృతి వెంకట్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం : జి.వి.ప్రకాష్‌.