Jul 29,2021 22:25

సర్పంచి ప్రమీలమ్మ

       గోరంట్ల : మండలంలోని మందలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నట్లు సర్పంచి ప్రమీలమ్మ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచి ప్రమీలమ్మ, ఆమె భర్త వైసిపి నాయకులు ముసలిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ సహకారంతో పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. నీటి బోర్లకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించామన్నారు. అవసరమైన చోట నూతన విద్యుత్‌ మోటార్లు ఏర్పాటు చేసి నీటి సమస్య పరిష్కరించామని చెప్పారు. త్వరలో విద్యుత్‌ స్తంభాలకు ఎల్‌ఇడి బల్బులు ఏర్పాటు చేస్తామన్నారు సిసి రోడ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు నిధులు వచ్చిన వెంటనే రోడ్ల నిర్మాణం చేస్తామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి పంచాయతీ అభివద్ధికి కషి చేయనున్నట్లు వారు చెప్పారు.