Jun 02,2023 00:12

జెండాను ఆవిష్కరిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - మద్దిపాడు : ఆటో యూనియన్‌ మండల కమిటీ (సిఐటియు) ఆధ్వర్యంలో గురువారం డ్రైవర్స్‌డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్‌ జిల్లా నాయకులు ఎండి. బేగ్‌ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి ఆదిలక్ష్మి మాట్లాడుతూ ట్రాన్స్‌పోర్ట్‌ రంగంలో ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొస్తున్నట్లు తెలిపారు. దీంతో కార్మికులకు ఇబ్బందులు తప్పవన్నారు. ఆటో డ్రైవర్లను సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో హుసేన్‌, రవి, ఠాగూర్‌, వెంకటేశ్వర్లు, ఉమేష్‌. ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.