Jan 15,2022 11:17

నరసరావుపేట (పశ్చిమ గోదావరి) : మద్యం మత్తులో కుటుంబంపై వాలంటీర్‌ దాడి చేసిన ఘటన నరసరావుపేటలో చోటుచేసుకుంది. నరసరావు పట్టణంలోని నిమ్మతోటకు చెందిన షేక్‌ జిలాని, రమిజ దంపతులు ఇంట్లో ఉన్న సమయంలో మూడో వార్డు వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్న మహబూబ్‌ ఉరప్‌ వారింట్లోకి వచ్చాడు. మత్తులో ఉన్న మహబూబ్‌ అసభ్య పదజాలంతో దూషిస్తుండటంతో రమిజ అదేమని ప్రశ్నించింది. మహబూబ్‌ తన వెంట తెచ్చుకున్న ఇనుపరాడ్డుతో ఆమెపై దాడి చేశాడు. అడ్డుగా వచ్చిన ఆమె భర్తను, అత్తను గాయపర్చాడు. బాధితులు రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.