
న్యూఢిల్లీ : రూ.3 కోట్ల విద్యుత్ బిల్లుకు సంబంధించిన షాకింగ్ ఘటనలో విద్యుత్ సంస్థకు చెందిన ముగ్గురు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. తప్పుడు బిల్లు నమోదు చేసిన సిబ్బందిని తొలగించడంతో పాటు విద్యుత్ సంస్థ అసిస్టెంట్ రెవెన్యూ అధికారిని సస్పెండ్ చేసినట్లు తెలిపింది. ఆ ఏరియా జూనియర్ ఇంజనీర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించింది. మానవ తప్పిదం కారణంగా బిల్లు మూడు కోట్లరూపాయలుగా వచ్చిందని విద్యుత్ కంపెనీ జనరల్ మేనేజర్ నితిన్ మాంగాలిక్ తెలిపారు. గ్వాలియర్ నగరంలోని శివ విహార్ కాలనీలో సంజీవ్ కంకనేకి విద్యుత్ బిల్లు రూ. 3,419 కోట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ బిల్లుని చూసిన కంకనే తండ్రి సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో ఈ ఘటనపై కంకనే ట్రాన్స్‌కో అధికారులకు ఫిర్యాదు చేశారు.