
ప్రజాశక్తి -కంచరపాలెం : ప్రమాదవశాత్తు రెండు అంతస్తుల భవంతి నుంచి జారి పడి బాలిక కు తీవ్రగాయాలైన ఘటన కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి కంచరపాలెం పోలీసుల కథనం ప్రకారం... బిర్లా కూడలి వద్ద నివాసముంటున్న సంకీర్తన (15) బాలిక మాధవధార ప్రాంతంలోని ప్రయివేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. బుధవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో రెండంతస్తుల భవంతిపై కుక్కతో ఆడుతుంది. ఈ క్రమంలో కుక్క దగ్గరికి వెళ్తున్న బాలిక అక్కడే ఉన్న పాలిథిన్ కవర్‌పై కాలు వేసి ప్రమాదవశాత్తు జారీ మొదటి అంతస్తుపై పడింది. దీంతో బాలిక రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబీకులు కెజిహెచ్‌లో చేర్పించారు. కంచరపాలెం పోలీసులు గురువారం ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాలిక తండ్రి పారసీ కిరణ్‌కుమార్ ఫిర్యాదు మేరకు సిఐ కృష్ణారావు నేతృత్వంలో ఎస్‌ఐ రవికిషోర్ విచారణ చేపట్టారు.