Jul 28,2021 06:22

రాజకీయమంటే
పండా కాయా
నిజంగా నిగనిగలాడే
మేడిపండు!!

మతోన్మాదం
మనస్సులోని మాట!!
శాంతిగీతం
పెదవులపై పాట!!

ఉద్యోగ ప్రకటన
ఎండమావి
నిరుద్యోగ జీవితం
ఎడారయ్యింది!!

రంగులు మారుస్తుంది
ఊసరవెల్లి,
కండువాలు మారుస్తరు
మన నేతలు!

నేతలందరిదీ
ఒకే మాట
అందితే జుట్టు
అందకుంటే కాళ్ళు!

- ఉప్పరి తిరుమలేష్‌
సెల్‌: 9618 961384