Nov 24,2022 11:38

ప్రజాశక్తి - పుల్లంపేట : పుల్లంపేట మండల పరిధిలోని అనంతయ్య పల్లి గ్రామ సచివాలయం నందు నవంబర్ 27వ తేదీ శనివారం నుండి డిసెంబర్ 4వ తేదీ ఆదివారం వరకు ఎనిమిది రోజులపాటు శంకర నేత్రాలయ కంటి వైద్యశాల చెన్నై మరియు టంగుటూరు చారిటబుల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరం జరుగునని అనంతయ్య పల్లి వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ కంటి చికిత్స సేవ ఉత్తర అమెరికా తెలుగు సమితి మరియు డాక్టర్ టంగుటూరి సంజీవరెడ్డి యు ఎస్ ఏ చే ఉచితముగా చేయబడుతుందని తెలిపారు. ఈ వైద్య శిబిరంకు వచ్చేవారు తప్పనిసరిగా ఫోన్ నెంబర్ మరియు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని రావాలని ఆయన తెలిపారు. చికిత్సకు వచ్చిన వారికి ఆపరేషన్ ఐఓఎల్ లైన్స్ మరియు కంటి అద్దాలు మందులు ఉచితంగా ఇవ్వబడునని తెలిపారు. ఎవరికైనా బిపి షుగర్ ఇతర వ్యాధులు ఉన్నవారు కంటి చికిత్సకు వచ్చేటప్పుడు వారి వెంట వారు వాడే మందులు తప్పనిసరిగా తీసుకురావాలని ఆయన తెలపారు. కంటి చికిత్స జరిగిన తరువాత రెండు గంటలలో ఇంటికి వెళ్లవచ్చునని తెలిపారు. ఈ ఉచిత చికిత్సను పుల్లంపేట మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.