May 04,2021 12:46

మెక్సికో : మెక్సికో నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. మైట్రో రైలు వంతెన కూలి 13 మంది దుర్మరణం చెందారు. మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వంతెన కూలిన ప్రదేశంలో మైట్రో రైలు వంతెన కింద ఉన్న పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటనాస్థలాన్ని మెక్సికో సిటీ మేయర్‌ క్లాడియా షీన్‌బౌం పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అగ్నిమాపక దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులరే మెరుగైన వైద్యం అందించాలని మేయర్‌ అధికారులను ఆదేశించారు.