Nov 30,2022 22:49

ప్రజాశక్తి-మండపేట
స్థానిక సంగమేశ్వర కాలనీలోని మండల ప్రజా పరిషత్‌ ప్రాథమిక పాఠశాల్లో మహాకవి గురజాడ అప్పారావు వర్థంతి బుధవారం నిర్వహించారు. గురజాడ చిత్రపటానికి పాఠశాల హెచ్‌ఎం చిట్టూరి వెంకట శ్రీధర్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు ఘన నివాళులర్పించారు. ఈసందర్భంగా శ్రీధర్‌ మాట్లాడుతూ గురజాడ కన్యాశుల్కం, బాల్య వివాహాలు వంటి సాంఘిక దురాచారాలపై రచనల సాగించడమే కాకుండా తెలుగులో వ్యావహారిక భాషలో రచనలు సాగించి, కన్యాశుల్కం నాటకంతో ప్రపంచానికి తెలుగు సాహిత్యం గొప్ప తనాన్ని పరిచయం చేశారన్నారు. అనంతరం విద్యార్థులు దేశమును ప్రేమిం చుమన్నా గేయాన్ని ఆలపించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బోణం సునీత, పావులూరి శేషారత్నం పాల్గొన్నారు.