Oct 03,2022 00:20

గాంధీ అధ్యయన కేంద్రంలో కరపత్రాలను కలెక్టర్‌ కృతికా శుక్లా

ప్రజాశక్తి - యంత్రాంగం
జాతిపిత మహాత్మాగాంధీ అక్టోబరు 2వ తేదీ 153 జయంతి సందర్భంగా ఆదివారం జిల్లాలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దేశ స్వతంత్రానికిత జాతిపిత గాంధీ చేసిన పోరాటం చాలా గొప్పది అంటూ కొనియాడుతూ గాంధీజీ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కాకినాడ కలెక్టరేట్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో దేశ స్వాతంత్య్రానికి జాతిపిత మహాత్మా గాంధీ చేసిన పోరాటం చాలా గొప్పదని జిల్లా కలెక్టర్‌ కతికా శుక్లా అన్నారు. ఈసందర్భంగా తకలెక్టర్‌ కతికా శుక్లా, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ, డీఆర్‌వో కె.శ్రీధర్‌రెడ్డి తదితరులు మహా త్ముని విగ్రహానికి, మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కాకినాడలోని గాంధీభవన్‌లో 1950లో ప్రారంభమై, గాంధీజీ ఆశయాల స్ఫూర్తిగా కార్యకలాపాలు సాగిస్తున్న గాంధీ భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్‌ కృతికా శుక్లా, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి-75 వసంతాల భారత ప్రజాస్వామ్యం, నేటి సవాళ్లపై గాంధీ అధ్యయన కేంద్రం రూపొం దించిన కరపత్రాలను కలెక్టర్‌ కతికా శుకా, జెసి ఇలక్కియా ఆవిష్కరించారు. కార్యక్రమంలో గాంధీ భవన్‌ ప్రధాన కార్యదర్శి వైఎస్‌వీఎస్‌ మూర్తి, సంయుక్త కార్యదర్శి వి.రామకష్ణ, అధ్యక్షుడు వీఎల్‌ గాంధీ, గాంధీ అధ్యయన కేంద్రం డైరెక్టర్‌ ఆచార్య ఐ.దోసగిరిరావు పాల్గొన్నారు. జెఎన్‌టియుకె ప్రాంగణంలో రిజిస్ట్రార్‌ ఎల్‌. సుమలత, రెక్టార్‌ కెవి.రమణ, ఓఎసిడి ప్రొ.డి.కోటేశ్వరరావు, యుసిఇకె ప్రిన్సిపాల్‌ ఎం.హెచ్‌. ఎం.కృష్ణ ప్రసాద్‌, విభాగాధిపతులు, టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది గాంధీజీ విగ్ర హానికి, లాల్బహదూర్‌ శాస్త్రి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌ బహుదూర్‌ శాస్త్రి చిత్రపటాలకు కౌడా చైర్‌ పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి కుమార్‌, ఎడిసి సిహెచ్‌ నాగ నరసింహా రావు, ఎంహెచ్‌ఓ డాక్టర్‌ పథ్వి చరణ్‌, ఎస్‌ఈ పి. సత్య కుమారి, అధికారులు నివాళులర్పించారు. గొల్లప్రోలు నగర పంచాయతీ చైర్‌ పర్సన్‌ మంగతాయారు శ్రీరామచంద్ర మూర్తి, కమిషనర్‌ సత్యనారాయణ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అన్నవరం సత్యదేవ లయన్స్‌ క్లబ్‌ సొంత భవనం వద్ద కొత్తగా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సత్యదేవ లయన్స్‌ క్లబ్‌ అన్నవరం అధ్యక్షురాలు పంచాది సునీతరాజ్‌ మాట్లాడుతూ నేటి యువత గాంధీజీని ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని ఆమె పిలుపునిచ్చారు. క్లబ్‌ కార్యదర్శి, దేవస్థానం డిఇ పి.గుర్రాజు మాట్లాడారు. అనంతరం ఇటీవల రాష్ట్ర స్థాయిల రోప్‌ స్కిప్పింగ్‌లో గోల్డ్‌ మెడల్స్‌ సాధించిన పలివెల దీపికా కుమారిని సత్కరించి అభి నందిచారు క్లబ్‌ సభ్యులు డొంకాడ గిరి, ఎం.అర్జునరావు, అడపా సత్తిబాబు, మచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు. పెద్దాపురం మున్సిపల్‌ పార్కులోని గాంధీ విగ్రహానికి చైర్పర్సన్‌ బొడ్డు తులసి మంగతాయారు, వైస్‌ చైర్మన్లు నెక్కంటి సాయి ప్రసాద్‌,కనకాల మహాలక్ష్మి ల ఆధ్వర్యంలో మున్సిపల్‌ కౌన్సిలర్లు నివాళులర్పించారు. మెయిన్‌ రోడ్‌ ఐసిఐసిఐ బ్యాంకు సెంటర్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రాజా సూరిబాబు రాజు, టిడిపి నాయకులు నివాళులర్పించారు. మన పెద్దాపురం ఫేస్బుక్‌ ఆధ్వర్యంలో నివాళులర్పిం చారు. కాజులూరు మండల పరిషత్‌ కార్యాలయం వద్ద గాంధీజీ విగ్రహానికి జడ్‌పిటిసి వనుము వెంకట సుబ్బారావు, మండల బీసీ సెల్‌ కన్వీనర్‌ గుబ్బల ఏసురాజు, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వరదా శేషారావు, మాతా బారతి మురళీ, బలభద్రుడని మల్లేశ్వరరావు కూనపరెడ్డి శివ, సర్పంచ్లు ఎంపిటిసిలు నివాళులర్పించారు. సామర్లకోట రూరల్‌ మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలోని మహాత్ముని విగ్రహం వద్ద ఎంపిపి బొబ్బరాడ సత్తిబాబు, ఎంపిడిఒ డి శ్రీలలిత, కార్యాల యం ఎఒ వివీరసాయిబాబు, ఎంఇఒ వై.శివరామకృష్ణయ్య, సిబ్బంది నివాళులర్పించారు. తహశీల్దార్‌ కార్యాలయంలో తహశీల్దార్‌ లక్ష్మీనరస కుమారి, డిప్యూటీ తహశీల్దార్‌ ఆర్‌ శ్రీనివాసు, ఆర్‌.ఐఎం రాజేష్‌, విఆర్వోలు, సిబ్బంది నివాళురల్పించారు. పెదబ్రహ్మ దేవం గ్రామ పంచా యతీ వద్దగల గాంధీజీ విగ్రహం వద్ద ఎం.పి.టి.సి. సభ్యులు మలకల సూర్యారావు,గ్రామ సర్పంచ్‌ నీలపాల సత్యనారాయణ నివాళులర్పించారు. తాళ్ళరేవు: గాంధీనగర్లో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పూలే అంబేద్కర్‌ స్టడీ సర్కిల్‌ ప్రతినిధులు, ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ టేకుమూడి ఈశ్వరరావు, అత్తిలి బాబు రావు, స్థానిక మాజీ సర్పంచ్‌ వాసంశెట్టి శ్రీనివాస్‌, ప్రతినిధులు నివాళులర్పించారు. గండేపల్లి మండలం మురారి గ్రామ సచివాలయం లో గామ సర్పంచ్‌ కుక్కల ఆనంద్‌ బాబు, ఉప సర్పంచ్‌ జాస్తి వసంత్‌, గ్రామస్తులు, అధికారులు గాంధీజీ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కరప ఎంపీపీ శ్రీ లక్ష్మి సత్తిబాబు ఆధ్వర్యంలో, జడ్‌పి హైస్కూల్‌లో జెడ్పీ టీసి సుబ్బారావు, తహశీల్దార్‌ కార్యాలయం లో తహశీల్దార్‌ శ్రీనివాస్‌, వేళంగిలో సర్పంచ్‌ సవిలే నీలిమా రాజేష్‌ అధ్యక్షతన మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.
గాంధీ విగ్రహానికి వినతులు
కాకినాడలో సర్పంచుల నిధులు దారి మళ్లింపును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఆదివారం కాకినాడ సిటీ నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు వనమాడి కొండబాబు ఆధ్వరంలో గాంధీనగర్‌ పార్కులోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి వినతిపత్రం అందజేశారు. తాళ్ళరేవు: లో టిడిపి రాష్ట్ర మహిళా ఉపాధ్య క్షురాలు పొన్నమండ రామలక్ష్మి, ముమ్మిడివరం నియోజకవర్గం సమన్వయ కమిటీ సభ్యులు ధూళి పూడి వెంకటరమణ (బాబి), వుంగరాల వెంకటేశ్వరరావు, జక్కల ప్రసాద్‌ బాబు, కట్టా త్రిమూర్తులు ం వినతిపత్రం సమర్పించారు.
పెద్దాపురం : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ను పునరుద్ధరించాలని, పెండింగ్‌ క్లెయిమ్‌ లు విడుదల చేయాలని, ఇతర అవసరాలకు వాడుకున్న రూ .2,500 కోట్లు భవన నిర్మాణ సంక్షేమ బోర్డుకు జమ చేసే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుతూ ఆదివారం భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సిఐటియు మండల అధ్యక్షులు గడిగట్ల సత్తిబాబు, ప్రైవేట్‌ ఎలక్ట్రికల్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు చింతల సత్యనారాయణ పాల్గొన్నారు.