Oct 17,2020 12:23

హైదరాబాద్‌ : పరుశురామ్‌ దర్శకత్వంలో మహేష్‌బాబు నటిస్తున్న సర్కార్‌ వారి పాట సినిమాలో కీర్తి సురేష్‌ ఎంపికయ్యారు. మహా నటి సావిత్రితో జాతీయ అవార్డు పొందిన కీర్తి శనివారం పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహేష్‌ బాబు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ...సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. 'సూపర్‌ టాలెండెట్‌ కీర్తి సురేష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. సర్కార్‌ వారి పాట సినిమాలో భాగస్వామ్యమౌతున్నందున చిత్ర యూనిట్‌ మీకు స్వాగతం పలుకుతోంది. మరుపురాని చిత్రాలతో ఇది ఒకటిగా నిలుస్తుందని చెప్పగలను' అంటూ మహేష్‌ ట్వీట్‌ చేశారు. దీనిపై కీర్తి సురేష్‌ రిప్లై ఇచ్చారు. మీతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని, షూటింగ్‌లో ఎప్పుడెప్పుడు పాల్గంటానా అని ఎదురుచూస్తున్నానని అన్నారు.