Apr 20,2021 21:38

మాట్లాడుతున్న డాక్టర్లు

చికిత్స పొందుతున్న మహిళ,
కడుపులోని నుంచి తీసిన కణితి
ప్రజాశక్తి - నంద్యాల క్రైమ్‌: 
నంద్యాల పట్టణం జ్ఞానాపురంలోని రాఫా, మహిళ, చిన్న పిల్లల ఆసుపత్రిలో డాక్టర్‌ ఆశాలత ఆధ్వర్యంలో లక్ష్మీదేవి అనే మహిళ కడుపులో ఉన్న 3.8 కేజీల కణితిని శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. గర్భిణి స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్‌ ఆశాలత మాట్లాడుతూ నంద్యాల చెందిన లక్ష్మీదేవికి కొన్ని రోజులుగా కడుపు పెరుగుతుండటంతో గర్భవతిగా భావించి వైద్య పరీక్షల నిమిత్తం రఫా హాస్పిటల్‌కు వచ్చారన్నారు. ఆమెను పరీక్షించడంతో గర్భం కాదని, కణితి ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వెంటనే మహిళకు శాస్త్రీయ చికిత్స ద్వారా గర్భసంచిలో ఉన్న 3.8 కేజీల కణితిని తొలగించినట్లు చెప్పారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్నదే రఫా హాస్పిటల్‌ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్‌ సుకుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.