Feb 09,2023 00:18

ప్రజాశక్తి-టంగుటూరు: స్థానిక పంచాయతీ కార్యాలయం ఎదురుగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చేయూత మహిళా మార్ట్‌లో వ్యాపారం ఆశాజనకంగా లేదని, విక్రయాలు పెంచేందుకు మహిళలందరూ సమిష్టిగా కషి చేయాలని జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ బడుగు బాబూ రావు సూచించారు. బుధవారం స్థానిక మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో ప్రభుత్వ పథకాల అమలు తీరు, మహిళల ఆర్థికాభివద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న కషిని ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో విఓఏలతో ఆయా గ్రామాల వారీగా పీడీ సమీక్షించారు. ఈ సందర్భంగా పీడీ బాబూ రావు మాట్లాడుతూ చేయూత మహిళామార్ట్‌లో గ్రామ సం ఘాల మహిళలకు తక్కువ ధరకే వస్తువులు విక్రయించేలా ప్రయత్నం చేయాలని, వస్తువులన్నీ క్రమపద్ధతిలో ఇతరులను సైతం ఆకర్షించేలా మార్ట్‌ను తయారు చేయాలన్నారు. మండలానికి గొర్రెలు, మేకల యూనిట్లు 50 ఉండాలని, గేదెల యూనిట్లు కూడా 30 మందికి తగ్గకుండా ఇవ్వాలని చెప్పారు. సచివాలయం పరిధిలో ఒక ఫిష్‌ ఆంధ్ర దుకాణం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న పాలవెల్లువ, జగనన్న తోడు, జగనన్న లే అవుట్ల గహ నిర్మాణాలపై ప్రత్యేక దష్టితో పనిచేయాలని పీడీ బాబురావు సీసీలు, విఓఏలకు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ పి.అజిత, జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ పి.సనిత, ఏరియా కోఆర్డినేటర్‌ గుంజి రాంబాబు, ఏపీఎం గంటా శ్రీనివాసరావు, వెలుగు సీసీలు మేడా వెంకట్రావు, కె చిన్నరాజు, చోడాబత్తిన గోవిందమ్మ, సీహెచ్‌ కవిత, కె పద్మజ, పలు గ్రామాల వీఓఏ లు పాల్గొన్నారు.