ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్
మహిళల అభివద్ధి సంక్షేమమే ముఖ్యమంత్రి వైసిపి ప్రభుత్వాశయమని ఎంపి వంగా గీత అన్నారు. స్థానిక జగన్నాథపురం ఎంఎస్‌ఎన్ చార్టీస్ సమీపంలోని పైడా గ్రౌండ్స్‌లో సోమవారం కాకినాడ సిటీ ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రూ..25.32 కోట్ల వైఎస్సార్ ఆసరా మెగా చెక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మూడవ విడత రుణమాఫీ మొత్తాన్ని విడుదల చేసిన సీఎం జగన్ చిత్రపటానికి నాయకులు, కార్యకర్తలు క్షీరాభిషేకం చేశారు. అంతకు ముందు నాయకులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిటీ ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం క్రమం తప్పకుండా మూడు విడతలుగా వైఎస్‌ఆర్ ఆసరా ద్వారా రుణమాఫీ చేసి మాట నిలుపుకున్నారన్నారు. అదనపు కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు మాట్లాడుతూ వైఎస్సార్ ఆసరా ద్వారా మూడు విడతల్లో ఇప్పటి వరకు రూ.75.23 కోట్లు లబ్థిదారులకు పంపిణీ చేశామన్నారు. కాకినాడ అర్బన్ పరిధిలో మూడవ విడత 3,595 స్వయం సహాయక సంఘాలకు గాను 36,751 మంది లబ్థి పొందుతున్నారన్నారు. తీసుకున్నరుణాలను సద్వినియోగం చేసుకుని వ్యాపారాలను అభివృద్ధి చేసుకుని ఆర్థిక పరిపుష్టిని సాధించాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో కౌడ ఛైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మాజీ డిప్యూటీ మేయర్ మీసాల ఉదరుకుమార్, టిపిఆర్‌ఒ మానే కష్ణమోహన్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వర్థినీడి సుజాత, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, మాజీ కార్పొరేటర్లు మీసాల శ్రీదేవి, బొర్రా రమణ, కామాడి సీత, ఎంజీకే కిషోర్, నందం,కొప్పనాతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ ఆసరాతో మహిళల స్వావలంబన
పెదపూడి : ఆసరా ఉత్సవాల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం కాకినాడ జిల్లా పెదపూడి మండలం రామేశ్వరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అనపర్తి ఎంఎల్‌ఎ డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఇతర ప్రజ ాప్రతినిధులతో కలిసి కలెక్టర్ కృతికా శుక్లా ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఆరు నెలల క్రితం యూ. కొత్తపల్లిలో స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యంతో ఏర్పాటుచేసిన చేయూత మహిళా మార్టు మహిళలు వివిధ సంక్షేమ పథకాల్లో వచ్చిన లబ్ధిని పెట్టుబడిగా పెట్టి మంచి లాభాలు ఆర్జిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా సామర్లకోట, తొండంగి, కిర్లంపూడిలో మహిళా మార్టులను ఏర్పాటు చేశా మన్నారు. మరో రెండు నెలల్లో పెదపూడి మండలంలో కూడా ఒక మహిళా మార్టు నెలకొల్పేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. సామర్లకోటలో ఇటీవల ప్రారంభించిన వస్త్ర తయారీ యూనిట్‌ను మహిళలందరూ సందర్శించాలన్నారు. అనపర్తి ఎంఎల్‌ఎ డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగనోహనరెడ్డి అన్ని వర్గాల మహిళలకు చేయూత వంటి పథకాలను అమలు చేశారని, రైతులకు అన్ని విధాలా ఆదుకుంటున్నారన్నారు. రామేశ్వరం గ్రామంలో సుమారుగా రూ.7 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్ర మాలతో పాటు సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించినట్టు తెలిపారు. అనంతరం పెదపూడి మండలానికి సంబంధించి వైఎస్సార్ ఆసరా మూడో విడతగా 1,438 సంఘాలకు రూ. 14.69 కోట్ల మెగా చెక్కును కలెక్టర్, ఎంఎల్‌ఎ, ఇతర ప్రజాప్రతినిధులు మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు. రామేశ్వరం గ్రామంలో ఆసరా ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన రంగవల్లుల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పెదపూడి మండలం ఎంపిపి కేతా తులసీ, జడ్‌పిటిసి సభ్యురాలు అడపా వెంకటలక్ష్మి, అనపర్తి ఎఎంసీ చైర్మన్ సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ కె. శ్రీరమణి, గ్రామ సర్పంచ్ కుటికలపూడి చిన్న, ఎంపిడిఒ పి.విజరుభాస్కర్, తహశీల్దార్ టి.సుభాష్ ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గండేపల్లి మండల కార్యాలయం వద్ద సోమవారం ఎంపిపి చలగళ్ల దొరబాబు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎంఎల్‌ఎ జ్యోతుల చంటిబాబు పాల్గొని మహిళా సంఘాలకు ఆసరా చెక్కు అందజేశారు. గత మూడు సంవత్సరాల నుంచి మూడు విడ తలుగా డ్వాక్రా మహిళలకు ఆసరా పథకం ద్వారా లబ్ధి చేకూరేలా చేస్తున్నారని అదేవిధంగా ఈ సంవత్సరం రూ.8 కోట్ల 75 లక్షల మండలంలో లబ్ధిదారులకు చేకూరే విధంగా ఆయన బటన్ నొక్కి వారి వారి ఎకౌంట్లకు పంపిణీ చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో జడ్‌పిటిసి పరిమి వెంకటలక్ష్మి మంగతాయారు బాబు వైస్ ఎంపీపీ కుంచే రాజా, మండల పార్టీ అధ్యక్షులు కందులు చిట్టిబాబు మార్కెట్ యార్డ్ చైర్మన్ బాబు ఎంపిడిఒ బిఎస్‌కె. రామ్ ఎంపిఎం సన్యాసిరావు, ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపిటిసిలు పాల్గొన్నారు
పెదపూడిలో చెక్కు అందజేస్తున్న కలెక్టర్ కృతికా శుక్లా, ఎంఎల్‌ఎ సూర్యానారాయణరెడ్డి