Jul 29,2021 22:07

matladutunna cp

మహిళా సంరక్షణ కోసం దిశ యాప్‌ : సిపి శ్రీనివాస్‌
తోట్లవల్లూరు : మహిళల సంరక్షణ కోసం దిశ యాప్‌ రూపొందించబడిందనీ, స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్క మహిళ ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని చేసుకుని వినియోగించుకోవాలని విజయవాడ పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని పెనమకూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారంనాడు దిశ యాప్‌ పై అవగాహన సదస్సు నిర్వహించారు. విజయవాడ అడ్మిన్‌ డిసిపి మేరీ ప్రశాంతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పామర్రు నియోజకవర్గ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌, విజయవాడ ఈస్ట్‌ జోన్‌ డిసిపి హర్షవర్ధన్‌ రాజు మాట్లాడారు. మహిళలు ఈ యాప్‌ ను ఉపయోగించిన పామర్రు నియోజకవర్గ ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మహిళా సంరక్షణ కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందన్నారు. అందులో భాగంగా ఈ యాప్‌ను రూపొందించిందన్నారు. గ్రామ సర్పంచ్‌ నందేటి గంగాభవాని, ఎంపీడీవో స్వర్ణలత, తహశీల్దార్‌ వెంకట శివయ్య, పమిడిముక్కల ఎంపీడీవో ఏ ఎన్‌ వి నాంచార్‌ రావు ,ఏసీపీ కైలే విజయ పాల్‌, ఉయ్యూరు సిఐ ఎన్‌ ముక్తేశ్వరరావు, ఎస్‌ ఐ వై అర్జున్‌ తదితరులు పాల్గొన్నారు. తోట్లవల్లూరు, పమిడిముక్కల మండలాల మహిళలు పాల్గొన్నారు.