Oct 14,2021 20:25

బాడంగి లో మహిళలకు చెక్కును అందజేస్తున్న ఎమ్‌పి బెల్లాన, ఎమ్మెల్యే శంబంగి

ప్రజాశక్తి-బాడంగి : మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు తెలిపారు. గురువారం బాడంగిలో రెండో విడత వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం చెక్కులను వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూమండలంలో 949 స్వయం సహాయక సంఘాల్లోని 11,395 మంది మహిళలకు రూ.4.73 కోట్లను రెండో విడతలో అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ పీడీ అశోక్‌కుమార్‌, జెడ్‌పిటిసి సభ్యులు పెద్దింటి రామారావు, ఎంపిపి బోగి గౌరి, వైస్‌ఎంపిపి రమేష్‌నాయుడు, ఎంపిటిసి శ్రీనివాసరావు, సర్పంచ్‌ రమేష్‌, పూడి జగదీష్‌, ఎంపిడిఒ పట్నాయక్‌, తహశీల్దార్‌ ధనం, ఆవు సత్యనారాయణ, తెంటు మధు, శంకరరావు పాల్గొన్నారు.
భోగాపురం : మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. ఎంపిడిఒ కార్యాలయ ఆవరణలో ఎంపిపి ఉప్పాడ అనూష అధ్యక్షతన వైఎస్‌ఆర్‌ ఆసరా రెండో విడత చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సురేష్‌బాబు మాట్లాడుతూ 1055 గ్రూపుల్లో 11,521 మంది సభ్యులకు రూ.7.18 కోట్లను అందజేసినట్లు తెలిపారు. ముందుగా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి బంగారు నాయుడు, జెడ్‌పిటిసి పి.మంజులత, ఎంపిడిఒ బంగారయ్య, తహశీల్దార్‌ రమణమ్మ, వైసిపి మండల కన్వీనర్‌ ఉప్పాడ సూర్యనారాయణ, ఎపిడి సావిత్రి, ఎసి ఎస్‌.రాజ్‌కుమార్‌, ఎపిఎం విజరుకుమార్‌, స్త్రీనిధి ఎపిఎం అరుణ, వైస్‌ ఎంపిపి పి.సత్యవతి, మాజీ జెడ్‌పిటిసి బైరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ఉప్పాడ శివారెడ్డి, మత్స్యశాఖ డైరెక్టర్‌ మైలపల్లి నరసింహులు, యాత కార్పొరేషన్‌ డైరెక్టర్‌ నర్సింగరావు, కర్రోతు శ్రీనివాసరావు పాల్గొన్నారు.
డెంకాడ : మహిళాభ్యున్నతికి సిఎం జగన్‌ పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. మండలంలో అమకాం, వెదుల్లవలస, పేడాడ, బంటుపల్లి గ్రామాల్లో ఆసరా చెక్కులను ఆయన పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిపి బంటుపల్లి వెంకట వాసుదేవరావు, వైస్‌ ఎంపిపి పిన్నింటి తమ్మునాయుడు, తహశీల్దార్‌ పి.ఆదిలక్ష్మి, ఎంపిటిసి వి.అచ్చెన్నాయుడు, సర్పంచులు కలిశెట్టి రామకృష్ణ, హేమలత, నాయకులు చుక్కల జనార్దనరావు, బాలాజీ, గోపి, రాజు, శంకర్‌ పాల్గొన్నారు.
నెల్లిమర్ల : నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేటలో చైర్‌పర్సన్‌ బంగారు సరోజిని, వైస్‌ చైర్మన్లు సముద్రపు రామారావు, కారుకొండ వెంకట కృష్ణారావు ఆధ్వర్యంలో ఆసరా వారోత్సవాల్లో భాగంగా సిఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం చైర్‌పర్సన్‌ సరోజిని దంపతులు, సిఎంఎం దన్నాన గోవిందరావులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కో-ఆప్షన్‌ సభ్యులు చిక్కాల సాంబశివరావు, ఎఎంసి డైరెక్టర్‌ పోలుబోతు నారాయణమూర్తి, నాగవంశం కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మద్దిల వాసు, కౌన్సిలర్‌ పాండ్రంకి సత్యవతి, వైసిపి నాయకులు బి.శంకరరావు, నల్లి శ్రీను పాల్గొన్నారు. కొండవెలగాడలో ఆర్‌టిసి రీజనల్‌ చైర్‌పర్సన్‌ గదల బంగారమ్మ.. సారిపల్లి, రామతీర్థం, జోగిరాజుపేట, పూతికపేట గ్రామాల్లో డ్వాక్రా మహిళలకు ఆసరా పథకం చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎపిఎం పి.విజయలక్ష్మి పాల్గొన్నారు.
సాలూరు : మామిడిపల్లి పంచాయతీ కార్యాలయంలో డ్వాక్రా మహిళలకు సర్పంచ్‌ సువ్వాడ శశికళ, ఎంపిటిసి సువ్వాడ గుణవతి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు సువ్వాడ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.
కొత్తవలస : మండలంలోని కంటకాపల్లి గ్రామ సచివాలయం వద్ద సర్పంచ్‌ మదిన లక్ష్మి అధ్యక్షతన ఎపిఎం శ్రీనివాసరావు వైయస్సార్‌ ఆసరా రెండో విడత కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ వైయస్సార్‌ ఆసరా రెండో విడత నిధులు జమ కానున్నాయని, మహిళలకు జగన్మోహన్‌ రెడ్డి ఇస్తున్న దసరా కానుకని అన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఒ గంట వెంకటరావు, జెడ్‌పిటిసి నెక్కల శ్రీదేవి, ఎంపిపి నీలంశెట్టి గోపమ్మ, ఎంపిటిసిలు బోదల మాధురి, కె.పరదేసి నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు మేలాస్త్రి అప్పారావు, కాటకాపల్లి, చినరావుపల్లి సర్పంచులు పీతల కృష్ణ, బూసాల దేముడు, వైస్‌ సర్పంచ్‌ బోదల సుధాకర్‌, వైసిపి నాయకులు, వైకెపి సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
జామి : మండలంలోని అలమండలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పాల్గొన్నారు. మండలంలో 1247 స్వయం సహాయక సంఘాలకు రెండో విడత 8.13 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి జి.సరయు, ఎంపిపి సబ్బవరపు అరుణ, మండల పార్టీ అధ్యక్షుడు గొర్లె రవికుమార్‌, సీనియర్‌ నాయకులు సూరిబాబు రాజు, సర్పంచ్‌ కోట పాపమ్మ, ఎంపిటిసి గేదెల వెంకటరమణ, వైస్‌ సర్పంచ్‌ లగుడు దేవుడు, రాష్ట్ర గ్రీనరీ, బ్యూటీఫికేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ చలుమూరి సత్యారావు, నాయకులు చెంచునాయుడు, వైకెపి ఏరియా కో ఆర్డినేటర్‌ జయశ్రీ, తహశీల్దార్‌ నీలకంఠం, ఎంపిడిఒ సతీష్‌, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
విజయనగరం టౌన్‌: స్థానిక 16వ డివిజన్‌లో జరిగిన వైఎస్సార్‌ ఆసరా వారోత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా రుణాలను సద్వినియోగం చేసుకొని వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలని మహిళా సంఘాలకు సూచించారు. కార్యక్రమంలో నగర మేయర్‌ వెంపడాపు విజయలక్ష్మి, కమిషనర్‌ ఎస్‌ ఎస్‌ వర్మ, వైసిపి నగర అధ్యక్షులు ఆశపు వేణు, కార్పొరేటర్లు గుజ్జల నారాయణరావు, అల్లు చాణక్య, ఆసపు సుజాత, ఆల్తి సత్యకుమారి, పొంతపల్లి మాలతి, గాదెం మురళి, తదితరులు పాల్గొన్నారు.