Oct 15,2021 00:09

చీరాలలో ఆసరా చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి

ప్రజాశక్తి-గుడ్లూరు : మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి తెలిపారు. వైఎస్‌ఆర్‌ ఆసరా రెండో విడత చెక్కులను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో మొత్తం 1,034 పొదుపు సంఘాలకు రూ.8,16.55.625 మంజూరైనట్లు తెలిపారు. గుడ్లూరు డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలు నూరు శాతం చెల్లించి జిల్లాలోనే మొదటి స్థానం నిలిచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎపిఎం అశోక్‌, ఎంపిపి రమేష్‌, ఎంపిడిఒ కె.నాగేశ్వరరావు, సర్పంచి శంకర్‌, తహశీల్దారు శ్రీశిల్ప, మండల సమైఖ్య అధ్యక్షురాలు మరియమ్మ పాల్గొన్నారు. చీరాల : బడుగు బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి తెలిపారు. వైఎస్‌ఆర్‌ రెండో విడత చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. చీరాలలో మొత్తం 1,565 గ్రూపులు 15,523 సభ్యులు ఉన్నట్లు తెలిపారు. వైఎస్‌ఆర్‌ ఆసరా కింద వారికి రూ. 13,76,91,440 మంజూరైనట్లు తెలిపారు. అనంతరం పొదుపు మహిళలు ఏర్పాటు చేసిన పలు రకాల స్టాల్స్‌ను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిపిఎం సుబ్బారావు,ఏరియా కో ఆర్డినేటర్‌ అంబేద్కర్‌, ఎడి చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపిడిఒ సాంబశివరావు, తహశీల్దారు హుస్సేన్‌, మాజీ మంత్రి డాక్టర్‌ పాలేటి రామారావు, మున్సిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు, వైస్‌ చైర్మన్‌ జైసన్‌బాబు, ఎపిఎం సుబ్బారావు పాల్గొన్నారు.పొన్నలూరు : స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో వైఎస్‌ఆర్‌ ఆసరా రెండో విడత చెక్కులను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిడిసిసి బ్యాంక్‌ చైర్మన్‌, వైసిపి కొండపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ మాదాసి వెంకయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి మహిళ సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కె.మాధవరావు, జడ్‌పిటిసి బి.వెంకటేశ్వర్లు, వైసిపి మండల కన్వీనర్‌ పి.వెంకటేశ్వర్లు, సిరిగిరి గోపాలరెడ్డి, అన్ని గ్రామాల వైసిపి నాయకులు, సర్పంచులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.