Mar 02,2021 20:58

డస్సెల్‌డార్ఫ్‌: జర్మనీ పర్యటనలో ఉన్న భారత మహిళల హాకీజట్టు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ పరాజయాన్ని చవిచూసింది. మంగళవారం జరిగిన మూడోగేమ్‌లో భారత్‌ 0-2గోల్స్‌ తేడాతో ఓడింది. దీంతో జర్మనీ మహిళల హాకీజట్టు నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 3-0 ఆధిక్యతను సాధించింది. జర్మనీ తరఫున సోంజా(26వ ని.), ఫ్రాంజిస్కా(42వ ని.)లో గోల్స్‌ చేశారు. భారత మహిళల జట్టుకు మూడో పెనాల్టీ కార్నర్‌లో గోల్‌ చేసే అవకాశం లభించినా.. సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఇరుజట్ల మధ్య నాల్గో, ఆఖరి మ్యాచ్‌ గురువారం జరగనుంది.