May 16,2022 22:15

మిథాలీ, గోస్వామి దూరం
న్యూఢిల్లీ:
మహిళల టీ20 చాలెంజ్‌ టోర్నీ జట్లను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్న మూడు జట్లకు భారత స్టార్‌ ప్లేయర్లు స్మతి మందనా, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, దీప్తి శర్మ కెప్టెన్లుగా ఎంపికయ్యారు. ఈ మేరకు సోమవారం బీసీసీఐ మూడు జట్ల వివరాలను వెల్లడించింది. సూపర్‌నోవాస్‌కు హర్మన్‌ప్రీత్‌, ట్రయల్‌బ్లేజర్స్‌కు మందనా, వెలాసిటీ జట్టుకు దీప్తి కెప్టెన్లుగా బోర్డు ఎంపిక చేసింది. ఈ జట్లలో తెలుగు అమ్మాయిలు అరుంధతిరెడ్డి, మేఘన చోటు దక్కించుకున్నారు. భారత స్టార్‌ క్రికెటర్లు మిథాలీ రాజ్‌, జులన్‌ గోస్వామి, శిఖా పాండే విశ్రాంతి తీసుకోగా.. మొత్తం 12 మంది విదేశీ ప్లేయర్లు బరిలోకి దిగనున్నారని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ ట్రయల్‌బ్లేజర్స్‌ మరోసారి ట్రోఫీని ఎగరేసుకుపోవాలనే పట్టుదలతో ఉంది. వచ్చే ఏడాది ఐపీఎల్‌గా రూపాంతరం చెందుతుండడంతో ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించేందుకు ప్లేయర్లు మెరుగైన ప్రదర్శన చేయాలనే కసితో ఉన్నారు.

సూపర్‌నోవాస్‌: హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), తనియా భాటియా, అలనా కింగ్‌, ఆయుశ్‌ సోనీ, చందు, డీయేంద్ర దాటిన్‌, హర్లీన్‌ డియోల్‌, మేఘనా సింగ్‌, మోనిక పటేల్‌, ముస్కన్‌ మాలిక్‌, పూజా వస్త్రాకర్‌, ప్రియా పునియా, రాశీ కనోజియా, సోఫీ ఎకల్స్టన్‌, సునీ లావ్స్‌, మనిషి జోష.

ట్రయల్‌బ్లేజర్స్‌ : స్మతి మందనా (కెప్టెన్‌), పూనమ్‌ యాదవ్‌, అరుంధతి రెడ్డి, హేలీ మ్యాథ్యూస్‌, జెమియా రోడ్రిగస్‌, ప్రియాంక ప్రియదర్శిని, రాజేశ్వరి గైక్వాడ్‌, రేణుకా సింగ్‌, రిచా ఘోష్‌, మేఘన, సైకా ఇషాక్యు, సల్మ ఖాతూన్‌, శర్మీన్‌ అక్తర్‌, సోఫియా బ్రౌన్‌, సుజాత మల్లిక్‌, ఎస్‌బీ పొఖార్కర్‌.

వెలాసిటి: దీప్తి శర్మ (కెప్టెన్‌), స్నేV్‌ా రానా, షఫాలీ వర్మ, అయబొంగ ఖాక, నవ్‌గిరె, కత్యాన్‌ క్రాస్‌, కీర్తి జేమ్స్‌, లార వొల్వార్డ్ట్‌, మాయ సొనవనె, నథాకాన్‌ చాంథమ్‌, రాధ యాదవ్‌, ఆర్తి కేదర్‌, శివాలీ షిండే, సిమ్రాన్‌ బహదూర్‌, యస్తిక భాటియా, ప్రణవి చంద్ర.