
ప్రజాశక్తి - బొబ్బిలి రూరల్ : సిఎం పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన హామీని నిలబెట్టు కొన్నామని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు అన్నారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో వైఎస్సార్ క్రాంతి పదం ఆధ్వర్యంలో వైఎస్సార్ ఆసరా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో ఉన్న అప్పును దఫలవారీగా మహిళలు ఖాతాల్లో వేస్తామన్న మాట ప్రకారం ఇప్పుడు మూడో విడత వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ సావు వెంకట మురళీ కృష్ణారావు, ఎంపిపి సంబంగి లక్ష్మీ, మండల వైసిపి అధ్యక్షులు శంబంగి వేణు గోపాల్ నాయుడు, బుడా ఛైర్మెన్ ఇంటి పార్వతి, పట్టణం వైసిపి అధ్యక్షులు ఇంటి గోపాల్ రావు, జెడ్‌పిటిసి యస్.శాంతి కుమారి, కమిషనర్ శ్రీనివాసరావు, ఎంపిడిఒ భాస్కరరావు, మెప్మా పీడీ సుధాకర్, డిపియం బి.బంగారమ్మ, తదితరులు పాల్గొన్నారు.
కొత్తవలస: మండలంలోని 1602 స్వయం సహాయక సంఘాలకు రూ.8.87 కోట్లకు నేరుగా మహిళలు ఖాతాల్లో జమ చేయడం జరిగిందని ఎస్ కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. మండల కేంద్రంలో లలితా కన్వెన్షన్ హాల్లో సోమవారం ఆసరా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు అండగా ఉన్న సిఎంకు మహిళలు కూడా రాబోయే ఎన్నికల్లో తోడుగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడు బాబు, ఎంపిపి నీలంశెట్టీ గోపమ్మ, జెడ్‌పిటిసి నెక్కల శ్రీదేవి, పిఎసిఎస్ చైర్మన్ గొరపల్లి శివ, జైసిఎస్ కన్వీనర్ బొంతుల వెంకటరావు, వైస్ ఎంపిపి కర్రీ శ్రీను, కొత్తవలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి, సర్పంచులు, ఎంపిటిసిలు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, వాలంటీర్లు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, టిఎల్‌ఎఫ్ సభ్యులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.