Oct 03,2022 00:17

తాళ్లరేవులో ఐద్వా సమావేశంలో ఐక్యతను చాటుతున్న మహిళలు

ప్రజాశక్తి - తాళ్ళరేవు
మద్యపానానికి వ్యతిరేకంగా మహిళల్లో కూడా చైతన్యం రావాలని పలువురు ఐద్వా నాయకులు పిలుపునిచ్చారు. మండల అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం జనరల్‌ బాడీ సమావేశం కె ఈశ్వరి బాయి అధ్యక్షతన ఆదివారం ప్రజా సంఘాల కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులు సీనియమహిళా నాయకురాలు చెక్కరమని ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో ఇప్పటికీ మహిళలు రెండో తరగతి పౌరులు గానే జీవిస్తు న్నారని, ఇప్పటికీ కొనసాగుతోందని మహిళలు ప్రజాప్రతి నిధులుగా ఎన్నికైన పురుషులు పెత్తనం చేయడం దీనికి నిదర్శనమని అన్నారు. ఈ సమాజంలో మహిళలపై జరుగు తున్న అఘాయిత్యాలకు ముఖ్య కారణం మద్యపానమని దీనిని నియంత్రించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించా లన్నారు. పార్లమెంటులో మహిళలకు 33% రిజర్వేషన్‌ చట్టం కోసం పోరాడాలని అన్నారు. అనంతరం తాళ్ళరేవు మండలానికి మహిళా సంఘం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వై అప్పయమ్మ, ఎస్‌ కళావతి, టీ కనకదుర్గ, వి. లోవ కుమారి, ధనలక్ష్మి, నగోమి, కష్ణవేణి గ్రామాల నుండి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.