Oct 03,2022 02:44
మహితను ప్రశంసిస్తున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌

ప్రజాశక్తి-కారంచేడు: మండలంలోని స్వర్ణ గ్రామానికి చెందిన అన్నం మహిత అను కళాకారిణి పెన్సిల్‌ మీద పలువురి పేర్లు చిత్రపటాలు చెక్కుతూ సూక్ష్మ కళాకారిణిగా ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె వైఎస్సార్‌ జీవిత చరిత్రను పెన్సిల్‌ మీద రాసి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రశంసలు పొందింది. అయితే తాజాగా ఆదివారం నాడు గాంధీ జయంతి సందర్భంగా మహాత్మాగాంధీ జీవితాన్ని పెన్సిల్‌ మీద చెక్కి ఆ కళారూపాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌కు చూపించారు. ఈ కళారూపాల చరిత్రను చూసిన కలెక్టర్‌ సదరు మహితను ఎంతగానో అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని కళారూపాలు చేయాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మహిత తండ్రి నరసింహారావు కూడా ఉన్నారు.