
ముంబై :2020 నుంచి కాంగ్రెస్ పార్టీ నూతన స్పీకర్‌ను ఎంపికచేయకుండా నాన్చడం వల్ల అప్పటి నుంచి మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ స్థానం ఖాళీగా పడి ఉంది. దానికి ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. పూర్తి స్థాయి స్పీకర్ లేని కారణంగా డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ ఆ బాధ్యతను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తలెత్తిన రాజకీయ సంక్షోభంలో ఆయన పాత్ర కీలకంగా మారింది. బిజెపి కుట్రల నుంచి మహా వికాస్ అఘాదీ (ఎంవిఎ) ప్రభుత్వాన్ని కాపాడడంలో ఆయన ఏమేరకు సఫలీకృతులవుతారో వేచి చూడాలి. 2019లో శివసేన, కాంగ్రెస్, ఎన్‌సిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు అసెంబ్లీ స్పీకర్‌గా నానా పటేల్ ను నియమించారు. 2020లో పటేల్‌ను కాంగ్రెస్ చీఫ్‌గా నియమించడంతో స్పీకర్ పదవి ఖాళీ అయింది.