Jul 20,2021 12:12

హైదరాబాద్‌ : సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుకి తన కుమార్తె అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిన విషయమే. ఇక సోషల్‌ మీడియాలో కూడా తండ్రి కూతుళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోలనే ఆయన ఎక్కువగా షేర్‌ చేస్తారు. అలాగే మహేష్‌బాబు.. సితారకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటాంటూ తన ప్రేమను వ్యక్తపరుస్తారు. నేడు (జూలై 20) ఆయన గారాలపట్టి సితార పుట్టినరోజు. ఈ సందర్భంగా మహేష్‌బాబ ట్విటర్‌ ద్వారా తన కుమార్తెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. '9వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన నా చిన్నారి పాపకు బర్త్‌డే శుభాకాంక్షలు. నా ప్రపంచంలో వెలుగులు విరజిమ్మే నిన్ను.. ఎంతగా ప్రేమిస్తున్నానో నీ ఊహకు కూడా అందదు' అంటూ మహేష్‌బాబు ట్వీట్‌ చేశారు. అలాగే సితార బెలూన్లు చేతపట్టుకొని నవ్వుతున్న ఫొటోను సైతం ఆయన అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో సితార ఫొటోలు వైరల్‌గా మారయి.
మహేష్‌బాబు 'సర్కారువారి పాట' చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ పరుశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌ పరిసరాల్లో షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ క్రమంలో సెట్స్‌లో మహేష్‌బాబు చెప్పిన ఓ భారీ డైలాగ్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌ అవుతోంది.

sitara 4

 

sitara 3

 

sitara 4

 

sitara 2