Sep 15,2021 08:16

తంబల్లపల్లె (చిత్తూరు) : మిద్దె పై పడుకున్న వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసిన ఘటన బుధవారం తంబల్లపల్లె నియోజకవర్గంలో చోటుచేసుకుంది. తంబల్లపల్లె మండలం ఎరసానివారిపల్లెకు చెందిన ధనేశ్వర్‌ రెడ్డి అలియాస్‌ ధన (38) మిద్దెపైన పడుకొని ఉండగా.. ఈరోజు తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు ధనను హత్య చేశారు. పాత కక్షలే కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.