Feb 06,2023 21:30

మినీ ట్రైన్‌ను ప్రారంభిస్తున్న పిఒ బి.నవ్య

సీతంపేట: స్థానిక ఎన్టీయార్‌ అడ్వంచర్‌ పార్క్‌లో చిన్న పిల్లల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన మినీ ట్రైన్‌ను ఐటిడిఎ పిఒ బి.నవ్య సోమవారం ప్రారంభించారు. రూ.3 లక్షలతో మినీ ట్రైన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పార్క్‌లో ఇప్పటికే చిన్న పిల్లల కోసం అనేక రకాల క్రీడలు అందుబాటులో ఉన్నాయని, ఇప్పుడు ఏర్పాటు చేసిన ఈ మినీ ట్రైన్‌ కూడా పిల్లలను మరింత ఆకట్టుకుంటుందని అన్నారు. కార్యక్రమంలో పార్క్‌ మేనేజర్‌ సవరరాజు, ఇతర పార్క్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.