
రికార్డులను పరిశీలిస్తున్న డిఎం అండ్ హెచ్‌ఒ,
ప్రజాశక్తి-పాడేరు టౌన్: మండలంలోని మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం డిఎం అండ్ హెచ్‌ఒ సి.జమాల్ భాషా తనిఖీ చేశారు. వైద్య సేవలపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సూచనలు చేశారు. ఆసుపత్రిలో సుఖ ప్రసవాలు, రికార్డులు నిర్వహణ అంశాలపై ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫ్యామిలీ ప్రోగ్రాం వైద్య శిబిరాల్లో వైద్య సిబ్బంది విధిగా హాజరు కావాలన్నారు. ఆయన వెంట పిహెచ్ సి వైద్యాధికారి గోపాలకష్ణ, జిల్లా టిబి పర్యవేక్షకులు వి.కిరణ్ ఉన్నారు.