Mar 19,2023 22:25

మల్లు స్వరాజ్యం చిత్రపటం వద్ద నాయకుల నివాళి

ప్రజాశక్తి-చీమకుర్తి : తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యంకు సిపిఎం మండల కమిటీ ఘన నివాళులర్పించింది. స్థానిక పంగులూరి కృష్ణయ్య భవనంలో సిపిఎం మండల కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌కె.మాబు మాట్లాడుతూ తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంలో మల్లు స్వరాజ్యం తెగువ, ఆమె చూపిన ధైర్యసాహసాలు స్ఫూర్తిదాయకమన్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరముందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి పూసపాటి వెంకటరావు, మండల కమిటీ సభ్యులు పల్లాపల్లి ఆంజనేయులు, క్రిష్టిపాటి చిన్నపురెడ్డి, టి. రామారావు, కంకణాల వెంకటేశ్వర్లు, బెజవాడ శ్రీను, ఓబులేషు, కుమ్మిత శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.