Jun 02,2023 15:48

ప్రజాశక్తి-ఆత్మకూరు : ఆత్మకూరు మండల పరిధిలో పంపనూరు గ్రామ తండాలో శుక్రవారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ వీరబ్బాయి పంపనూర్ తండా గ్రామాన్ని సందర్శించడం జరిగింది. గ్రామంలో దోమల నివారణకు జరుగుతున్న మలతీయన్ పొడి పిచికారీ మరియు ఫ్రైడే డ్రైడే కార్యక్రమంను పరిశీలించడం జరిగింది. అలాగే ప్రజలకు సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగీ వ్యాధుల ఎలా వ్యాపిస్తాయి. వాటి నివారణ మార్గాల గురించి, ఇండ్లలో నీటి నిల్వలు లేకుండా చేసి వారానికి ఒకసారి డ్రైడే పాటించాలని లార్వాలు పెరగకుండా చూసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్గించడం జరిగింది. మలతీయన్ పొడి పిచికారీ ప్రతి ఇంట్లో ఆ చేయించుకోవలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారితో పాటు మలేరియా అధికారి ఓబులు, వైద్యాధికారి దయాకర్, ఉప మలేరియా అధికారి సత్యనారాయణ, మలేరియా ఉప విభాగం సూపర్ వైజర్లు, ఎంపీహెచ్ ఈ ఓ నాగేశ్వరయ్య, మునాఫ్,ఏఎన్ ఎమ్ వెంకటలక్ష్మీ, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు వెన్నెల, తేజేస్విని, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు