Oct 03,2022 19:21

పూజలు నిర్వహిస్తున్న పీఠాధిపతులు

ప్రజాశక్తి - మంత్రాలయం
ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో కొలువైన గ్రామ దేవత మంచాలమ్మకు పీఠాధిపతులు శ్రీసుభుదేంధ్రతీర్థులు పంచామృతాభిషేకం, సుగంధ ద్రవ్యాభిషేకం నిర్వహించారు. సోమవారం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాష్టమి సందర్భంగా పూజారులు నిర్మాల్యం చేశారు. అనంతరం పీఠాధిపతులు శ్రీసుభుదేంధ్రతీర్థులు విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా పట్టు చీరతో, వివిధ రకాల పుష్ప హారాలతో అలంకరించారు. పుష్పార్చన, పసుపు కుంకుమలతో, పండ్లు, నైవేధ్య సమర్పణ చేపట్టారు.