Oct 26,2021 20:19

మారుతి దర్శకత్వంలో సంతోష్‌ శోభన్‌ హీరోగా చేస్తున్న సినిమా 'మంచి రోజులచ్చాయి'. మెహరీన్‌ కౌర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి టైటిల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. 'చీకటిలో ఉన్నా.. దారే లేకున్నా నీకే నువ్వు తోడై ఉండిలే' అంటూ సాగుతున్న ఈ పాట సరదా సన్నివేశాలతో సాగుతూ సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. శ్యామ్‌ కాసర్ల రాసిన ఈ పాటను హరిచరణ్‌, శ్రావణి పాడారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌ టైనర్‌గా సాగనున్న ఈ మూవీలో వెన్నెల కిశోర్‌, సప్తగిరి, వైవా హర్ష, అశిష్‌ ఘోష్‌ నటించారు.

'మంచి రోజులచ్చాయి' టైటిల్‌ సాంగ్‌https://youtu.be/MOL1rnvXHgg