Oct 15,2021 00:08

ఎంపిపిని సన్మానిస్తున్న అధికారులు, నాయకులు

ప్రజాశక్తి-టంగుటూరు : టంగుటూరు మండ లాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని పిడిసిసి బ్యాంకు చైర్మన్‌, వైసిపి కొండపి నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జి డాక్టర్‌ మాదాసి వెంకయ్య తెలిపారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమా వేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి బాలినేని, మండల నాయకుల సహకారంతో అన్ని సమస్యలు పరిష్కరించుకొని మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేద్దామని తెలిపారు. అనంతరం ఎంపిపి పంటాపంజుల కోటేశ్వరమ్మను డాక్టర్‌ వెంకయ్య, వైసిపి నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షుడు సూదనగ ుంట శ్రీహరిరావు, జడ్‌పిటిసి మన్నం అరుణకుమారి,వైస్‌ఎంపిపి దగ్గుమాటి సుమన్‌రెడ్డి,కమ్మ కార్పొ రషన్‌ డైరెక్టర్‌ బొడ్డపాటి వెంకట అరుణ, కొమ్ము ప్రభుదాసు, గొళ్ళపూడి సునీత, వైసిపి నాయకులు మేదరమెట్ల భరత్‌రెడ్డి పాల్గొన్నారు.