Aug 05,2022 23:22

సచివాలయ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ రవి పఠాన్‌శెట్టి

సచివాలయాల్లో ఆకస్మిక తనిఖీలు
ప్రజాశక్తి - పరవాడ

మండలంలోని జిల్లా కలెక్టర్‌ రవి పఠాన్‌శెట్టి శుక్రవారం మండలంలో పర్యటించారు. పరవాడ సచివాలయం -2, రావాడ, భరిణికం సచివాలయాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ నిధులతో చేపట్టిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ సెంటర్లు, డిజిటల్‌ లైబ్రరీల భవన నిర్మాణా పనులను పరిశీలించారు. సచివాలయాల్లో ప్రజలకు ఏ విధమైన సేవలు అందుతున్నాయో వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పన, జల్‌ జీవన్‌ మిషన్‌, నాడు-నేడు, ఏపీ హౌసింగ్‌ గృహాల పనుల గురించి రివ్యూ నిర్వహించారు. సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకున్న వారికి సత్వరమే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్‌ వెంట ఎంపీడీవో హేమసుందరరావు. డిప్యూటీ తహశీల్దారు కె.వరహాలు, రావాడ సర్పంచ్‌ మోటూరు సన్యాసినాయుడు, హౌసింగ్‌ ఎఇ వైయస్‌ఎన్‌.రెడ్డి, అన్ని శాఖల అధికారులు, వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.