Jun 23,2021 15:47

మండపేట (తూర్పు గోదావరి) : స్థానిక పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సర్దార్‌ శ్రీ వేగుళ్ళ వీర్రాజు మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో వైద్యాధికారిణి కళ్యాణి ఆధ్వర్యంలో పెద్దలకు, చిన్నారులకు వైద్య సిబ్బంది వ్యాక్సిన్‌ వేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు, ఉన్నత పాఠశాలలో పెద్దలకు కరోనా వ్యాక్సిన్‌ వేస్తున్నారు. ఈ సందర్భంగా వైద్యాధికారిణి మాట్లాడుతూ.. చిన్నారులను ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుకునేందుకు తప్పకుండా వ్యాక్సిన్‌ వేయించాలని సూచించారు. ప్రజలంతా కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మాస్క్‌ విధిగా ధరించాలన్నారు. ప్రతి బుధ, శనివారం వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరుగుతుందని గర్భిణులు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది సుమ, సరస్వతి, నీలిమ, శ్రీవాణి, సచివాలయ ఉద్యోగులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.