ప్రజాశక్తి - చిప్పగిరి
చిప్పగిరి మండలంలో ప్రతి గ్రామంలో కూడా వైసిపి అభివృద్ధికి కృషి చేస్తూ, గుమ్మనూరు జయరాం ఏ ఆదేశాలిచ్చినా వమ్ము చేయకుండా పని చేస్తానని వైసిపి చిప్పగిరి కన్వీనర్‌గా ఎన్నికైన ఏరూరు రంగస్వామి తెలిపారు. సోమవారం మార్కెట్ యార్డు ఛైర్మన్‌గా గుమ్మనూరు నారాయణ ప్రమాణ స్వీకారోత్సవం ముగిసిన అనంతరం సభలో చిప్పగిరి వైసిపి కన్వీనర్‌గా ఏరూరు రంగస్వామిని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి జయరాం, మార్కెట్ యార్డు ఛైర్మన్ గుమ్మనూరు నారాయణ ఏ కార్యక్రమం చేయమన్నా మండలంలో విజయవంతం చేస్తామన్నారు. అంకితభావంతో పని చేసే కార్యకర్తలకు పార్టీలో ఎప్పుడూ అన్యాయం జరగదన్నారు. పార్టీ నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకొని రాబోయే 2024 ఎన్నికల నాటికి మండలంలో వైసిపికి అత్యధిక మెజార్టీ వచ్చేలా కృషి చేస్తామన్నారు. అసెంబ్లీ బూత్ కన్వీనర్ రాజన్న, వైసిపి ఎస్సీ మండల కన్వీనర్ నాగరాజు, గురునాథ, ధర్మేంద్ర, షేకన్న, సతీష్, బాలకృష్ణ పాల్గొన్నారు. అంతకుముందు ఆలూరు మార్కెట్ యార్డు ఛైర్మన్‌గా గుమ్మనూరు నారాయణ ప్రమాణ స్వీకారత్సవానికి మండలం నుంచి ఎంపిటిసిలు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు దాదాపు 100 వాహనాల్లో తరలి వెళ్లారు.
వైసిపి మండల కన్వీనర్‌గా రంగస్వామిని ప్రకటిస్తున్న మంత్రి జయరాం