Oct 18,2020 23:51

'మంత్రి సురేష్‌పై అసత్య ఆరోపణలు తగవు'
ప్రజాశక్తి-పెద్దదోర్నాల
జడ్‌పి మాజీ చైర్మన్‌ నూకసాని బాలాజీ యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎక్కడైనా గెలిచి ఆతర్వాత మాట్లాడాలని మాజీ జడ్‌పిటిసి అమిరెడ్డి రామిరెడ్డి సవాల్‌ విసిరారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో రామిరెడ్డి మాట్లాడారు. విద్యాశాఖామంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌పై బాలాజీ అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు. స్థాయి మరిచి మంత్రిపై ఆరోణలు చేయడం మానుకోవాలని ఆయన హితువు పలికాడు. ఈ సమావేశంలో వైసిపి మైనారిటీ కార్యదర్శి అబ్ధుల్‌ మజీద్‌, నాయకులు ఆవులయ్య, పవన్‌కుమార్‌, అలుగుల లక్ష్మయ్య, వెన్నా కాశిరెడ్డి, మల్లారెడ్డి, బాలకాశయ్య, గాలెయ్య పాల్గొన్నారు. పెద్దారవీడు : రాష్ట్ర విద్యాశాఖామంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌పై టిడిపి ఒంగోలు నియోజక వర్గ పార్లమెంట్‌ అధ్యక్షులు నూకసాని బాలాజీ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని వైసిపి మండల అధ్యక్షులు పాలిరెడ్డి కష్ణారెడ్డి డిమాండ్‌ చేశాడు. దేవరాజుగట్టులో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నూకసాని బాలాజీ తన స్థాయి మరిచి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌పై ఆరోపణలు చేయడం దారుణమన్నారు. ఈ సమావేవంలో ఏరువ చలమారెడ్డి, బిసి నాయకులు తోకల ఆవులయ్య, తిమ్మరాజు, ఏలూరి వెంకటనారాయణరెడ్డి, మూల అల్లూరిరెడ్డి, వల్లెల.ఈశ్వరరెడ్డి, కాసు వెంకటరెడ్డి, షేక్‌ బుజ్జీ తదితరులు పాల్గొన్నారు.