Oct 05,2022 13:10

ప్రజాశక్తి-పెద్దకడుబూరు: పెద్దకడబూరు మండల పరిధిలోని జాలవాడి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ సంభవించి బుధవారం సాంబమూర్తి(26)అనే యువకుడు మృత్యువాత పడ్డారు. బంధువులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో రెండు రోజులుగా తాగునీటి బోరు పనిచేయడం లేదు. మృతుడు సాంబమూర్తి ప్రైవేటుగా ఎలక్ట్రికల్ పనిచేసి జీవనం కొనసాగించేవారు. అయితే ఉదయం తాగునీటి బోరు వద్ద పని చేయడానికి వెళ్లారు. బోరు వద్ద ఏర్పాటు చేసిన ఇనుప రేకు డబ్బా తెరుస్తుండగా విద్యుత్ షాక్కు గురై సాంబమూర్తి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సాంబమూర్తి మృతి సమాచారం తెలిసిన వెంటనే తల్లి జయలక్ష్మి, భార్య  మనీ ఈశ్వరమ్మ కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతునికి ఇద్దరు కుమారులు అని తెలియజేశారు.