Jul 29,2021 21:30

తొలి రెండు ఈవెంట్‌లలో నిరాశపరిచిన షూటర్‌ మను బాకర్‌ ఫామ్‌లోకి వచ్చింది. గురువారం ఉదయం జరిగిన 25మీ. పిస్టల్‌ ఈవెంట్‌ క్వాలిఫికేషన్‌ ప్రిసిషన్‌ రౌండ్‌లో ఐదో స్థానంలో నిలిచింది. 44మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో మను 292 పాయింట్లు సాధించింది. టాప్‌లో సెర్బియాకు చెందిన అరునోవిక్‌(296పాయింట్లు), కొరకాకి(గ్రీస్‌) 294పాయింట్లు, కొస్టాడినోవా(బల్గేరియా) 293పాయింట్లు, రష్యా(292పాయింట్లు) మనుకంటే ముందున్నారు. మరో షూటర్‌ రాహి షర్నోబత్‌(287పాయింట్లు) 25వ స్థానానికే పరిమితమైంంది. ఇంతకుముందు జరిగిన 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత, మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లలో మను నిరాశపర్చిన విషయం తెలిసిందే.