May 04,2021 12:49

మొగల్తూరు (పశ్చిమ గోదావరి) : మొగల్తూరు మండల కేంద్రం మొగల్తూరులో కరోనా వైరస్‌ కట్టడికి అధికారులు చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం సబ్‌ కలెక్టర్‌ కెఎస్‌.విశ్వనాథన్‌ ఆదేశాల మేరకు.. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఎంపిడిఒ డాక్టర్‌ ఆర్సి ఆనంద్‌ కుమార్‌, తహసీల్దార్‌ ఎస్‌ కె.హుస్సేన్‌, ఎస్‌ఐఎస్‌ ప్రియకుమార్‌ పర్యవేక్షణలో పంచాయతీ సిబ్బంది చర్యలు చేపట్టారు. మొగల్తూరు గ్రామంలోనికి ఇతర ప్రాంతాల నుండి ఎవ్వరూ రాకుండా, ఇతర ప్రాంతాల్లోనివారు మొగల్తూరు గ్రామంలోకి రాకుండా రహదారులకు అడ్డంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఒక ప్రాంతంలో ఎక్కువ కరోనా కేసులు వస్తే ఆ ప్రాంతంను రెడ్‌జోన్‌గా ఏర్పాటుచేసి బ్లీచింగ్‌ను చల్లుతున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ముచ్చర్ల నాగేశ్వరరావు, సుబ్బారావు, శ్రీను, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.