Aug 08,2022 00:23

ప్రజాశక్తి - ఉండ్రాజవరం భావితరాలకు మనమిచ్చే సంపద స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకర వాతావరణమేనని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ బూరుగుపల్లి సుబ్బారావు అన్నారు. ఆదివారం బౌద్ధ ధమ్మ పీఠంలో పీఠాధిపతి భంతే అనాలయో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా అనాలయో మాట్లాడుతూ పీఠం ఆధ్వర్యంలో ప్రతి ఏడాదీ గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుందని, ఆజాదీ కా అమత్‌ మహౌత్సవ్‌ లో భాగంగా ఈ సంవత్సరం 45 వేల రూపాయల వ్యయంతో 600 వివిధ రకాల పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలను కొని గ్రామంలోని రోడ్లకు ఇరువైపులా నాటే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. మండల ప్రజలకు అవసరమైన మొక్కలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రావులపాలెంకు చెందిన శివప్రసాద్‌ వివిధ రకాల మొక్కలలో ఔషధ మొక్కల గురించిన వివరాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో డి.కళారావు, జి.వెంకటరావు, ఎస్‌.గోకుల కష్ణ, స్వాతి, తదితరులు పాల్గొన్నారు.