May 29,2023 21:20

మాట్లాడుతున్న రామాంజనేయులు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
నియంతృత్వ, రాచరికం వైపు నడుస్తున్న మోడీ విధానాలను తిప్పి కొట్టాలని, రాజ్యాంగ విలువలను రక్షించుకుంటూనే ప్రజా సమస్యలపై పని చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు బి.రామాంజనేయులు కోరారు. సోమవారం పశ్చిమ ప్రాంత జిల్లా స్థాయి సిపిఎం శిక్షణ తరగతులు పట్టణంలోని పద్మశాలి కల్యాణ మండపంలో ప్రారంభమయ్యాయి. మొదటి రోజు క్లాసులను రామాంజనేయులు మాట్లాడి ప్రారంభించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.వెంకటేశులు అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభలో రామాంజనేయులు, జిల్లా నాయకులు ఎమ్‌డి.ఆనంద్‌ బాబు, టి.నరసింహ, లింగన్న, లక్ష్మన్న, వీరశేఖర్‌, హనుమంతు మాట్లాడారు. దేశంలో మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం నియంతృత్వంగా రాచరికం వైపు నడిపిస్తోందని విమర్శించారు. ఎందరో త్యాగధనులు పోరాడి సాధించిన భారత స్వాతంత్య్ర ఫలాలను ప్రజలందరికీ అందేలాగా, రాజ్యాంగ విలువలను రక్షించుకుంటూనే, ప్రభుత్వాల అప్రజాస్వామిక విధానాల కారణంగా రోజువారీగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పనిచేయాలని కోరారు. అనంతరం 'నయా ఉదారవాద విధానాలు- ప్రజలపై వాటి ప్రభావం' అనే క్లాసును టి.నరసింహ, మతం-మతతత్వం అనే క్లాసును కెవి.నారాయణ బోధించారు. సిపిఎం ఆలూరు నాయకులు నారాయణస్వామి, మంత్రాలయం నాయకులు జయరాజు, కౌతాళం నాయకులు మల్లయ్య, పెద్దకడబూరు నాయకులు తిక్కన్న, కోసిగి నాయకులు రాముడు, తుగ్గలి నాయకులు శ్రీరాములు, నాయకులు పాల్గొన్నారు.