Jul 28,2021 23:40

మాట్లాడుతున్న ఎమ్మెల్యే శివకుమార్‌

ప్రజాశక్తి-తెనాలి : కరోనా విపత్తులో అడ్రస్‌ లేని నాయకులు ఇప్పుడు ఓదార్పు యాత్ర చేపట్టారని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ ఎద్దేవా చేశారు. మాజీ స్పీకర్‌, జనసేన పిఎసి చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఇటీవల కరోనాతో, వివివ ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ కరోనా బాధిత కుటుంబాలను పరామిర్శిస్తున్నారు. వీటిపై ఎమ్మెల్యే శివకుమార్‌ బుధవారం వైసిపి కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. కరోనాను ఎదుర్కొంనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని, ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన సదుపాయాలు కల్పించి, కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చిందని చెప్పారు. భయంకరమైన పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైసిపిదన్నారు. పరామర్శలు కూడా రాజకీయం చేయవద్దని హితవు పలికారు. సమావేశంలో కౌన్సిలర్‌ జి.శ్రీనివాసరావు, నాయకులు ఎం.ప్రభాకరరావు, టి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.