
ప్రజాశక్తి - రేపల్లె
మండలంలోని పేటేరు గ్రామంలోగల భూపతి ప్రసాద్ కుమారుడు భూపతి ధనుష్ (21) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. గ్రామ యువకుడు మృతి చెందటం బాధ కలిగి వైసిపి కన్వీనర్ కనపర్తి రవికిరణ్ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎంపీ మోపిదేవి వెంకటరమణ రూ.10వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రవికిరణ్ తన వంతుగా రూ.5వేలను అందజేశారు. కార్యక్రమంలో వైసిపి లీగల్ సెల్ అధ్యక్షులు అల్లంశెట్టి శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ రావు ప్రభాకరరావు పాల్గొన్నారు.