Oct 02,2022 22:35
  • తలస్సేరికి కొడియేరి భౌతికకాయం

తిరువనంతపురం : తమ ప్రియతమ నేత, పోరాటయోధుడు కొడియేరి బాలకృష్ణన్‌ను ఇక లేడని తెలిసి ఆయన సొంత జిల్లా కన్నూరు కనీుటి సంద్రమైంది. నిర్బంధాన్ని అధిగమించి ఆయన చేసిన పోరాటాలను, కష్టకాలంలో అండగా నిలిచిన తీరును ప్రజానీకం గుర్తు చేసుకుంటున్నారు. ఆయన చూపిన బాటనే ముందుకుపోతామని ఎక్కడికక్కడ ప్రతినలు చేస్తూ కడసారి చూసేందుకు, అంతిమ నివాళులర్పించేందుకు బారులు తీరుతున్నారు. మరోవైపు అంత్యక్రియలు సోమవారం జరగుతాయని ముందుగానే ప్రకటించినప్పటికీ రాష్ట్రం నలుమూలల నుండి ఆదివారమే జనప్రవాహం కన్నూరుకు బయలుదేరింది. వాహనాలకు కడియేరి కటౌట్లు, ఫోటోలు పెట్టుకుని ఎర్రజెండాలతో ప్రజలు బయలుదేరిన దృశ్యాలు అన్ని జిల్లాల్లోనూ కనిపించాయి. చెనైు అపోలో అస్పత్రి నుండి ఆయన భౌతికదేహం కన్నూరుకు చేరుకుకునేటప్పటికే విమానాశ్రయం నుండి కిలోమీటర్ల తరబడి వేలాదిమంది ప్రజానీకం కొడియేరికి జోహార్లు చెబుతూ నిలబడి ఉండటం కనిపించింది. మరోవైపు కొడియేరి మృతదేహంతో చెనైు నుండి కన్నూరుకు బయలుదేరిన ఎయిర్‌ అంబులెన్స్‌ ఆదివారం మధ్యాహాుం 12.54 గంటలకు కన్నూరు ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. సిపిఎం కన్నూరు జిల్లా కార్యదర్శి జయరాజన్‌ మృతదేహాన్ని విమానాశ్రయంలో స్వీకరించారు. ఈ సమయంలో అక్కడ తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. పెద్దఎత్తున చేసిన రెడ్‌సెల్యూట్‌ నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. ఎయిర్‌పోర్టు నుండి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అంబులెన్స్‌లో తలస్సేరికి తరలించారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆయన ఐదు సార్లు ఎంఎల్‌ఏగా గెలిచిన సంగతి తెలిసిందే. అక్కడి టౌన్‌హాలులో ఆయన భౌతికకాయాన్ని ప్రజల అంతిమదర్శనార్ధం ఉంచారు. అంతకుముందు ఎయిర్‌పోర్టు నుండి తలస్సేరి టౌన్‌హాలు వరకు ఉన్న రహదారిలో ఉత్కంఠభరిత దృశ్యాలు కనిపించాయి. పోరాటధీరుడికి అంతిమ నివాళులర్పించడానికి రహదారికి రెండు వైపులా వేలాదిమంది ప్రజలు చేరారు. తలస్సేరిలోనూ జనం కిక్కిరిసిపోయారు. తొలుత ఎయిర్‌పోర్టు నుండి నేరుగా టౌన్‌హాలుకు భౌతికకాయాన్ని తీసుకుపోవాలని, అంతిమదర్శనం కోసం ప్రజలను అక్కడే అనుమతించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. అయితే, భారీ సంఖ్యలో ప్రజలు కదులుతుండటం, అప్పటికే తలస్సేరి కిక్కిరిసిపోవడంతో ఈ నిర్ణయానిు సవరించి వీలైనన్ని ఎక్కువ చోట్ల ప్రజల నివాళికి అవకాశం కల్పించారు. కన్నూరు ఎయిర్‌పోర్టు నుండి తలస్సేరి టౌన్‌హాలుకు మధ్య ఉన్న 24 కిలోమీటర్ల దూరంలో 14 ప్రాంతాల్లో అంబులెన్స్‌ను ఆపారు. దీంతో ప్రజలు ఎక్కడికక్కడ తమ నేతకు నివాళులర్పించారు.
టౌన్‌హాలు వద్ద...
టౌన్‌హాలు వద్ద కూడా ఉత్కంఠ పరిస్థితులు కొనసాగాయి. అశ్రునయనాల మధ్య కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, సిపిఎం పొలిట్‌బ్యూరో మాజీ సభ్యులు ఎస్‌. రామచంద్రన్‌ పిళ్ళై, కేరళ రాష్ట్ర సిపిఎం కార్యదర్శి ఎంవి గోవిందన్‌తో పాటు పలువురు సీనియర్‌ నాయకులు కొడియేరి బాలకృష్ణన్‌ భౌతికదేహంపై ఎర్రజెండాను కప్పి రెడ్‌సెల్యూట్‌ చేశారు. కొడియేరి ఆశయాలను ముందుకుతీసుకుపోతామని, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడతామని, సమసమాజానిు సాధిస్తామనిప్రతిన చేశారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో కూడా తమ అభిమాన నేతకుతుది నివాళులర్పించడానికి ప్రజలు వస్తూనే ఉనాురు. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత ఆయన స్వగ్రామమైన కొడియేరికి బాలకృష్ణన్‌ భౌతిక కాయానిు తరలించనునాురు. అక్కడి నుండి సోమవారం ఉదయం పది గంటలకుజిల్లా కమిటీ కార్యలయానికి భౌతికకాయానిు తీసుకువస్తారు. పార్టీ నేతలు, ప్రజల సందర్శనార్ధం అక్కడ మధ్యాహాుం వరకుఉంచుతారు. మధ్యాహుం మూడు గంటలకుపయ్యంబాలం బీచ్‌లో అంతిమసంస్కారాలు నిర్వహించనునాురు.