Nov 21,2020 20:59

అమరావతి బ్యూరో: మత్స్యకారుల అభివృద్ధిపై సిఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక దృష్టి సారించారని వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.225 కోట్లతో ఆక్వా హబ్‌లు ఏర్పాటు చేయాలని సిఎం నిర్ణయించారని పేర్కొన్నారు. బిసిల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 'ప్రాంతీయ అసమానతలతో విభజనను ప్రోత్సహించిన గత పాలకులను చూశామని, ప్రాంతీయ అసమానతలను తొలగించేలా సిఎం జగన్‌ పాలన చేస్తున్నారని పేర్కొన్నారు. అధికారం పోయేసరికి చంద్రబాబు మాయల ఫకీరు వేషాలు వేస్తున్నారని విమర్శించారు. టిడిపి హయాంలో అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేశారన్నారు.