Jul 29,2021 20:23

దీక్షనుద్దేశించి మాట్లాడుతున్న జెడ్‌పిటిసి మాజీసభ్యులు పెద్దబాబు

గంట్యాడ : గ్రీన్‌ కారిడార్‌ రోడ్డు నిర్మాణా నికి వ్యతిరేకంగా మండలంలోని కొర్లాం జంక్షన్లో రైతులు చేపడుతున్న నిరసన దీక్షలు గురువారం మూడో రోజుకు చేరాయి. దీక్షలకు జామి మండలం మాజీ జెడ్పిటిసి బండారు పెద్దబాబు సంఘీ భావం తెలుపుతూ రైతులంతా ఐక్యమత్యంతో పోరాడి తమ భూము లను కాపాడుకోవాలన్నారు. ఎపి కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి రాకోటి రాములు మాట్లాడుతూ మెంటాడ మండలంలో సుమారు 70 ఎకరాల వరకు భూమిని రైతులు కోల్పోతున్నార న్నారు. కావున రైతులంతా ఐక్యమత్యం తో పోరాడాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు జి.అప్పల సూరి మాట్లాడుతూ రోడ్డు నిర్మాణం ఆగినంత వరకు ఐక్యమత్యంతో రైతులంతా పోరాడాలని, ఇందుకు తమ సంఘం మద్దతు ఇస్తుందని అన్నారు. రైతు సంఘం జిల్లా నాయకులు వై.పైడ నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వాలు బలవంతంగా లాక్కున్న భూములకు రైతు ఉన్నంత వరకూ నష్టపరిహారం చెల్లించాలన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కృష్ణ జానపద గేయాలను ఆలపించి వ్యవసాయ కార్మికులు పడుతున్న ఇక్కట్లను తెలిపారు. శిబిరంలో మహిళా రైతులు, ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బుద్ధరాజు రాంబాబు, రైతులు కరక శ్రీను, గులుపిల్లి కృష్ణ, చప్ప సన్యాసినాయుడు, కృష్ణ పాల్గొన్నారు.