Dec 02,2021 02:41

కిల్లో కోమటి, గొల్లోరి డొంబు మృతదేహాలు

ప్రజాశక్తి - అనంతగిరి రూరల్‌
మండలంలో టోకూరు పంచాయతీ భగ్మరవలస గ్రామంలో పాతకక్షల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకొని ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తుల కథనం ప్రకారం...
టోకూరు పంచాయతీ భగ్మరవలస గ్రామానికి చెందిన గొల్లోరి డొంబు (50), గొల్లోరి సుబ్బారావు (30), కిల్లో కోమటి (48), కుటుంబాల మధ్య గతం నుంచి భూ తగాదాలు ఉన్నాయి. బుధవారం దగ్గరిలో ఉన్న డముకు సంతకు వెళ్లారు. పూటుగా మద్యం సేవించిన వచ్చిన గొల్లోరి డొంబు, గొల్లోరి సుబ్బారావు, కిల్లో కోమటి, కిల్లో బలరాం, కిల్లో భగవాన్‌ తదితరులు పాత భూ తగాదాల నేపథ్యంలో బుధవారం సాయంత్రం గొడవ పడ్డారు. అది కాస్తా చిలికిచిలికి గాలివానలా మారి రెండు వర్గాలు కత్తులు, గొడ్డళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో గొల్లోరి డొంబు, గొల్లోరి సుబ్బారావు, కిల్లో కోమటి మృతి చెందగా, కిల్లో బలరాం, కిల్లో భగవాన్‌ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని 108లో అనంతగిరి పిహెచ్‌సి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో ఇద్దరిని విశాఖపట్నం కెజిహెచ్‌కు తలిరంచారు. విషయం తెలుసుకున్న అరకులోయ సిఐ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.