Jul 29,2021 22:06

కరోనా పరీక్ష నిర్వహిస్తున్న సిబ్బంది


కరోనా పరీక్ష నిర్వహిస్తున్న సిబ్బంది
ముగిసిన గురుకులం ప్రవేశ పరీక్ష
ప్రజాశక్తి-బుచ్చిరెడ్డిపాళెం:గురుకులాల ఇంటర్మీడియట్‌ ప్రవేశ పరీక్ష మండలంలోని రామచంద్రపురం గ్రామంలోని బాలయోగి గురుకుల పాఠశాలలో కోవిడ్‌ నిబంధనలు అమలు చేస్తూ ప్రశాంతంగా పరీక్ష నిర్వహించారు. ఆ మేరకు విద్యార్థులు చేతులకు శానిటైజర్‌ వేయడంతో పాటు థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించి పరీక్ష గదిలోకి అనుమతించారు.
మొత్తం 316 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 278 మంది హాజరైనట్లు పాఠశాల ప్రిన్సిపల్‌ పద్మశ్రీ తెలిపారు.